Long Life: ఆయుష్షుని పెంచి 5 అద్భుతమైన సీక్రెట్ ల గురించి మీకు తెలుసా?

వయసు మీద పడుతున్న కొద్ది ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం అన్నది చాలా ముఖ్యం. ఇక ప్రస్తుతం కాలానికి అనుగుణంగా ఫుడ్ డైట్ నీ ఫాలో అవుతూ ఉంటే ఆరో

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 02:00 PM IST

వయసు మీద పడుతున్న కొద్ది ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం అన్నది చాలా ముఖ్యం. ఇక ప్రస్తుతం కాలానికి అనుగుణంగా ఫుడ్ డైట్ నీ ఫాలో అవుతూ ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే ఫిట్ గా కూడా ఉండవచ్చు. అలాగే ఏ వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించాలి అంటే అలాగే జీవితకాలం పెంచడానికి 5రకాల విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఆ ఐదు రకాల విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువును నియంత్రణలో ఉంచుకోవడం కోసం సరైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి నిర్వహణ నేర్చుకోవడం మంచి నిద్ర వాటి చేసుకుంటే అది మన బరువును కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.

బరువులో తరచుగా వచ్చే మార్పులు కూడా ఎక్కువకాలం జీవించడంపై ప్రభావితం చూపిస్తాయి. వృద్ధాప్యంతో మరణానికి అతిపెద్ద కారణం గుండె జబ్బులు, రొమ్ము, కొలొరెక్టల్ క్యాన్సర్, బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులే. ఒక పరిశోధనలో 30 వేల మందికి పైగా మహిళలు చేర్చబడ్డారు. ఇందులో 56 శాతం మంది మహిళలు 90 ఏళ్ల వరకు మాత్రమే జీవించారు. అలాగే ఈ పరిశోధనలో, బరువు ఒకే విధంగా ఉన్న, వారిలో వయస్సు 90, 95, 100 సంవత్సరాల వరకు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ విధంగా ఎవరి బరువు ఒకేలా ఉంటుందో, వారు ఎక్కువ కాలం జీవించినట్లు గుర్తించారు. వృద్ధాప్య మహిళలు వారి వయస్సును పెంచుకోవాలనుకుంటే, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి.

ఆరోగ్యకరమైన కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి. ఇది కాకుండా, శారీరకంగా చురుకుగా ఉండాలి, అతిగా తినడం మానుకోవాలి. యోగా చేయాలి. హైడ్రేషన్ పట్ల శ్రద్ధ వహించాలి, మంచి నిద్ర పొందాలి, వెద్య సలహా తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆహారం విషయంగా జాగ్రత్తగా ఉంటే, వర్కౌట్‌లు చేస్తే, జీవక్రియను చక్కగా ఉంచడానికి సహకరిస్తుంది., ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే, బరువును కాపాడుకోవచ్చు. జీవితంలో ఒత్తిడి ఉంటే, దానిని నిర్వహించడానికి, మార్గాలను వెతకాలి. ఇలా చేస్తే వయస్సు పెరిగినా, చాలా కాలం పాటు చురుకైన జీవితాన్ని గడపగలుగుతారు.