Theft in Raj Bhavan : నిందితుడి అరెస్ట్!

Theft in Raj Bhavan : పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 14న హెల్మెట్ ధరించి వచ్చిన ఓ అనుమానాస్పద వ్యక్తి కంప్యూటర్ రూమ్‌లోకి ప్రవేశించి

Published By: HashtagU Telugu Desk
Theft In Raj Bhavan Sriniva

Theft In Raj Bhavan Sriniva

తెలంగాణ గవర్నర్ కార్యాలయంగా ఉన్న రాజ్ భవన్‌(Raj Bhavan)లో చోటుచేసుకున్న చోరీ (Theft ) ఘటన కలకలం రేపుతోంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ రూమ్‌ నుంచి నాలుగు హార్డ్ డిస్కులు మాయమైనట్లు గుర్తించారు. ఈ హార్డ్ డిస్కుల్లో ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన రిపోర్ట్లు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. అధికార సిబ్బంది ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 14న హెల్మెట్ ధరించి వచ్చిన ఓ అనుమానాస్పద వ్యక్తి కంప్యూటర్ రూమ్‌లోకి ప్రవేశించి హార్డ్ డిస్కులు దొంగలించినట్లు గుర్తించారు. అతని ఛాయాచిత్రాలను విశ్లేషించిన అనంతరం, పోలీసులకు క్లారిటీ వచ్చింది.

Corona : భారత్ ను వెంటాడుతున్న కరోనా భయం..కొత్తగా 257 కేసులు

చివరికి ఆ వ్యక్తిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించబడిన ఉద్యోగి శ్రీనివాస్‌(Srinivas)గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. రాజ్ భవన్ వంటి అతి రక్షణ గల ప్రాంతంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన భద్రతా లోపాలపై ప్రత్యేక విచారణ జరుగుతోంది.

  Last Updated: 20 May 2025, 09:50 AM IST