Site icon HashtagU Telugu

Zoom Nomore : ఉగ్రవాదుల్ని పట్టించిన ‘జూమ్‌’(Zoom) ఇక లేదు..!!

Zoom

Zoom

అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యానికి పట్టించిన ‘జూమ్‌’(Zoom) ఇక లేదు. ఉగ్రదాడిలో రెండు తూటాలు తగలడంతో సైనిక ఆస్పత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయగా.. చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. సైనిక జాగిలం ‘జూమ్‌’ అడ్వాన్స్‌డ్‌ ఫీల్డ్‌ వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు సైన్యం వెల్లడించింది.