Record Low Weddings: మూడు పదులు దాటిన పెళ్లికి నో అంటున్న యువత… రికార్డ్ స్థాయిలో పడిపోయిన పెళ్లిళ్లు!

ప్రస్తుత కాలంలో యువత ఉన్నతమైన చదువులు చదువుతూ మంచి ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నతంగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అయితే మూడు పదుల వయసు దాటినా కూడా చాలామంది పెళ్లికి నో

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 08:50 PM IST

Record Low Weddings: ప్రస్తుత కాలంలో యువత ఉన్నతమైన చదువులు చదువుతూ మంచి ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నతంగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అయితే మూడు పదుల వయసు దాటినా కూడా చాలామంది పెళ్లికి నో అనే సమాధానం చెబుతున్నారు.ఇలా పెళ్లికి నో అని చెప్పడంతో ప్రతి ఏడాది పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య రికార్డు స్థాయిలో పడిపోవడం పలు దేశాలను కలవరపెడుతుంది. ఇప్పటికే చైనా, జపాన్ వంటి దేశాలలో జనాభా తగ్గిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పలు గణాంకాల ప్రకారం దక్షిణ కొరియాలో 2022వ సంవత్సరంలో వివాహాలు చేసుకునే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని తెలుస్తోంది.అత్యంత తక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి దక్షిణ కొరియాలో యువత మరింత ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో అక్కడి ప్రభుత్వం కాస్త కలవరపడుతుంది. గత సంవత్సరం 192000 జంటల వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక గణాంకాల ప్రకారం ఒక దశాబ్దం క్రితం 2012లో 327000 వివాహం చేసుకున్నారు. అయితే ఈ సంఖ్య ఇప్పుడు 40 శాతానికి తగ్గిపోయింది. ఇక 1970 వ సంవత్సరం నుంచి దక్షిణ కొరియా దేశవ్యాప్తంగా వివాహాలను నమోదు చేస్తూ వస్తుంది.

గత కొన్ని దశాబ్దాల నుంచి దక్షిణ కొరియా జనాభా పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుతం 5.2 కోట్ల జనాభా ఉండగా 2067 నాటికి ఈ సంఖ్య 3.9 కోట్లకు పడిపోనుందనీ నిపుణుల అభిప్రాయం.ఇలా జనాభా సంక్షోభాన్ని నియంత్రించడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. ఇలా దక్షిణ కొరియా జనాభాను పెంచడం కోసం 2006వ సంవత్సరం నుంచి భారీగా ఖర్చు చేస్తున్నారు.ఇలా జనాభా రేటు తగ్గిపోవడానికి కారణాలను కూడా నిపుణులు తెలియజేశారు. దక్షిణ కొరియాలో జీవన వ్యయంతో పాటు నివాస ఖర్చులు అధికంగా పెరగటం వల్ల యువత పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించకపోవడం కూడా ఒక కారణం.అలాగే మహిళలు ఉద్యోగం చేస్తుండడంతో తమ పిల్లలను చూసుకోవడానికి బారం అవుతుందన్న తరుణంలో పిల్లలను కనడానికి ఇష్టత చూపకపోవడంతో జనాభా రేటు తగ్గిపోతుందని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.