Site icon HashtagU Telugu

Begging At Airport: ఎయిర్‌పోర్ట్‌లో భిక్షాటన చేసిన యువకుడు.. టికెట్ కొనుగోలు చేసి మరీ ఆ పని?

Media 12168b61d2dd4fe3b20d6c90f3a84531britain Heathrow 73487

Media 12168b61d2dd4fe3b20d6c90f3a84531britain Heathrow 73487

Begging At Airport: సాధారణంగా రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద, ప్రార్థనా స్థలాలు, ట్రైన్లు, బస్టాండ్లల్లో భిక్షాటన చేసేవాళ్లని మనం చూస్తే ఉంటాం. కానీ అందరూ చేసినట్లు చూస్తే ఏముంటుంది. కాస్త భిన్నంగా భిక్షాటన చేయలని ఓ వ్యక్తి భావించాడు. తన రూటే సపరేటు అంటూ ఓ వ్యక్తి ఏకంగా ఎయిర్‌పోర్టులో భిక్షాటన చేయడం విచిత్రంగా మారింది. టికెట్ కొనుగోలు మరీ ఎయిర్‌పోర్టులో భిక్షాటన చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఓ యవకుడు వినూత్న ఆలోచన చేశాడు. యువకుడి తండ్రి ఆరోగ్యం బాగాలేదు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా.. ట్రీట్‌మెంట్ కోసం రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో తండ్రి చికిత్స కోసం డబ్బులు ఇవ్వాలని ఎయిర్‌పోర్టులో భిక్షాటన చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎయిర్ పోర్టు సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకుని అతడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. యువకుడి పేరు విఘ్నేష్ అని తెలుస్తోంది.

యువకుడి వయస్సు 27 ఏళ్లు కాగా.. టిప్ టాప్ రెడీ అయి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి నేరుగా చేరుకున్నాడు. ఆ తర్వాత చెన్నైకు వెళ్లేందుకు ఒక టికెట్ కొనుగలు చేశాడు. అనంతరం ఎయిర్‌పోర్ట్ లోపలికి బయలుదేరాడు. లోపలికి వెళ్లి తన తండ్రి ఆస్పత్రిలో చికత్స పొందుతున్నాడని, చాలా డబ్బులు ఖర్చు అవుతాయంటూ ప్రయాణికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ఇస్తే తన తండ్రిని బ్రతికించుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.

అయితే అతడిని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడి చెప్పిన వివరాలు తప్పు అని తేలింది. డబ్బుల కోసం తప్పుడు కథ అల్లినట్లు తెలిసింది. దీంతో అతడి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని చీటింగ్ కేసు నమోదు చేశారు. 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదైంది. అతడి నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అందులో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నట్లు గుర్తించారు.