Site icon HashtagU Telugu

Minister Gangula: దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోంది: మంత్రి గంగుల

Minister Gangula Kamalakar Meeting with Millers association

Minister Gangula Kamalakar Meeting with Millers association

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని…శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రము లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేజీ నుండి పీజీ వరకు విద్యను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో కెసిఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తాము చదువుకునే రోజుల్లో ఎటువంటి వసతులు ఉండేవి కావని..చదవాలని తపన ఉన్నా చదివించే ప్రభుత్వాలు ఉండేవి కావని అన్నారు. ఆనాడు చదువు అంటే కేవలం ఉన్నత వర్గాల వారికే పరిమితం అనే పరిస్థితి ఉండేదని..బీసీలు కేవలం కుల వృత్తులు చేసుకొని బతకాలని అనే వారని… కానీ నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో బీసీలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని అన్ని వసతులు కల్పించి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉంటే… నేడు స్వరాష్ట్రంలో కెసిఆర్ గారు 337 పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న కళాశాలలో పాటు మరో 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్య అంటే బీసీ బిడ్డలు వెనుకబడిన పరిస్థితి నుండి ఉన్నత వర్గాల వారిని మించి ఫలితాలు వచ్చే పరిస్థితి కి రావడాన్ని చూసి బీసీ బిడ్డగా గర్విస్తున్నాను అని అన్నారు.  దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోందని, కష్టపడి చదివి తల్లి దండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు.

Also Read: Manchu Lakshmi: కెమెరాకు అడొచ్చాడని మంచు లక్ష్మి సీరియస్, నెట్టింట్లో వీడియో వైరల్