Site icon HashtagU Telugu

Maharashtra: మహారాష్ట్రలో నీటి పైప్ లైన్ బీభస్తం.. దెబ్బకు ముక్కలైన రోడ్డు?

Whatsapp Image 2023 03 05 At 13.14.30

Whatsapp Image 2023 03 05 At 13.14.30

Maharashtra: అప్పుడప్పుడు నీటి తాకిడికి వాటర్ ట్యాంక్ లు కూలడం వంటివి చూస్తూ ఉంటాం. ఈ తాకిడి వల్ల కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో అక్కడ మనుషులు ఉంటే ఆ నీటి తాకిడికి గురి కావాల్సిందే. ఇప్పటికే పలు చోట్ల వాటర్ ట్యాంకులలో నీటి తాకిడి వల్ల పైనున్న మూత ఎగిరిన సంఘటనలు చాలా చోటు చేసుకోగా.. సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా నీటి ఒత్తిడి తట్టుకోలేక పైప్ లైన్ బద్దలైన ఘటన చోటుచేసుకుంది. ఇంతకు అసలు ఏం జరిగిందో చూద్దాం. యావత్ మాల్ జిల్లాలోని విదర్భ హౌసింగ్ సొసైటీలో నిన్న అనగా శనివారం రోజు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నీటి ఒత్తిడికి ఒకేసారి బద్దలైంది. దీంతో అక్కడున్న రోడ్డు మొత్తం ఒకేసారి ముక్కలైంది. రోడ్డుపైకి నీళ్లు వెదజల్లాయి. అదే సమయంలో అక్కడి నుంచి స్కూటీపై వెళ్తున్న మహిళపై భయంకరమైన అలలు నీరు ఎగిసిపడటంతో అక్కడికక్కడ ఆమె కింద పడిపోయింది.

దెబ్బకు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అమలు కాపాడారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనను ప్రత్యక్షంగా సాక్షి పూజా బిశ్వాస్ అక్కడ జరిగిన ఘటన గురించి తెలిపింది. సరిగ్గా ఆ ఘటన జరుగుతున్న సమయంలో తన ఫోన్లో మాట్లాడుతున్నానంటూ.. ఆ పైప్ లైన్ బద్దలవటంతో ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది అని.. చూడ్డానికి చాలా భయంకరం గా అనిపించింది అని తెలిపింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసి జనాలంతా భయపడుతున్నారు. ఆ సమయంలో ఇంకేమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని.. దయచేసి ఇటువంటి వాటిపై జాగ్రత్తలు వహించాలి అని కోరుకుంటున్నారు.