Tiger Spotted: పులిని వేధించిన గ్రామస్తులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

స్థానికులు పులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. కొందరు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.

  • Written By:
  • Updated On - August 30, 2023 / 01:45 PM IST

మధ్యప్రదేశ్‌లో స్థానికులు పులిని వేధిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. శారీరక సమస్యతో బాధపడుతున్న పులితో ఆడుకుంటున్న దృశ్యాలు రావడంతో స్థానికులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో చోటుచేసుకుంది. అడవిలో సంచరిస్తున్న పులిని చూసి స్థానికులు తొలుత భయాందోళనకు గురయ్యారు. అయితే పులి తప్పిపోయిందని స్థానికులు గుర్తించారు. అయితే కొందరు దానిని ఇబ్బందులు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

స్థానికులు పులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. కొందరు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. స్థానికులు కొందరు దానిపై ఎక్కి రైడ్‌కు కూడా వెళ్లారు. అయితే శారీరక సమస్యలతో బాధపడుతున్న పులి దాడి చేసేందుకు సాహసించకపోవడంతో స్థానికులు రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా, స్థానికులు కొందరు దానిని హత్య చేయాలని కూడా ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

చివరకు స్థానికులు కొందరికి సమాచారం అందించడంతో అటవీశాఖ సిబ్బంది స్థానికుల మధ్య నుంచి పులిని రక్షించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పులిని చికిత్స నిమిత్తం వాన్ విహార్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి పశువైద్యుడు పులికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అటవీశాఖ అధికారులు కూడా చెబుతున్నారు.

Also Read: Vangalapudi Anitha Arrest : చంద్రబాబుకు రాఖి కట్టేందుకు వెళ్తున్న వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు