Site icon HashtagU Telugu

Crime: క్షుద్ర పూజల కలకలం.. దుండగులను పట్టుకున్న గ్రామస్థులుcrimni

Crime

Crime

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దమ్ముగూడెం మండలంలోని గట్టుగూడెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు చేస్తున్నవారిని గిరిజనులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సుమారు 12మంది గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దుండగులను గ్రామస్థులంతా పట్టుకుంటుండగా అక్కడి నుండి కొంతమంది పరారయ్యారని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇద్దరు మంత్రగాళ్ళు వచ్చారని తెలిపారు.

గతంలో పలు తవ్వకాల్లో వీరు నిందితులుగా పట్టుబడినవారేనని చెప్పారు. శనివారం నుంచి తవ్వకాలు జరుపుతుండగా తాము గుర్తించామని, ఇప్పటికే దొరికిన కొంత నిధిని కారులో దుండగులు తరలించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దుండగులను పట్టుకున్న సమయంలో గ్రామస్తులకు నిధిలో వాటా ఇస్తామని చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. నిందితులను ట్రాక్టర్‌ పై పోలీస్టేషన్‌ కు తరలించారు..

Exit mobile version