TeenMaar:తీన్మార్ మల్లన్నలో ఇంత మార్పా..? ఏం జరిగిందో..!!

తీన్మార్ మల్లన్న...తెలంగాణ రాజకీయాల్లో అందరికీ పరిచయమున్న వ్యక్తి. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి...రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 09:39 AM IST

తీన్మార్ మల్లన్న…తెలంగాణ రాజకీయాల్లో అందరికీ పరిచయమున్న వ్యక్తి. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి…రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సమయం దొరికితే చాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై…తెలంగాణ సర్కార్ విరుచుకుపడతాడు. గతంలో జైలుకు కూడా వెళ్లాడు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మల్లన్నపై ఎన్నోకేసులు ఉన్నాయి. అలాంటి మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక్కమాట కూడా అనని స్పష్టం చేశారు. గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన 1200మూవ్ మెంట్ సన్నాహక కార్యక్రమానికి మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎంపై, మంత్రులపై విమర్శలు చేయడం తన విధానం కాదని..ఒట్టేసి చెబుతున్నా…కేసీఆర్ ను ఒక్కమాటకూడా తిట్టను…ప్రజా చైతన్యం కోసమే పోరాటం అన్నారు.

ఇక తన ఆస్తులన్నింటినీ సర్కార్ కు రాసిచ్చి..జూన్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. 7200మూవ్ మెంట్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడి రాజ్యం పోయి ప్రజాప్రభుత్వం ఏర్పడేదాక పోరాటం చేస్తానన్నారు. ప్రజాసేవచేయాలనుకునేవారు తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించిన తర్వాతే…రాజకీయాల్లోకి రావాలన్నారు. ఇక అకాల వర్షాలు రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంటే సీఎం ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు.