Site icon HashtagU Telugu

Digital Invitation: డిజిటల్ ఇన్విటేషన్ గురించి తెలుసా…?ఇప్పుడిదే ట్రెండ్!

Youtube 42415 Cjz66seqcty Imresizer

Youtube 42415 Cjz66seqcty Imresizer

Digital Invitation: ఇప్పుడంతా కూడా డిజిటల్ యుగం నడుస్తోంది. కిరాణా సామాను నుంచి డాక్టర్ సేవల వరకూ అన్ని డిజిటల్ బాటలోనే సాగుతున్నాయి. దీనికి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరంలేదు. కానీ వివాహాది శుభకార్యాలకు కూడా డిజిటల్ ఆహ్వానాలు అందించడం ఇప్పటి ట్రెండ్. ఇది కొంత ఢిపరెంట్ అనిపిస్తోంది కదూ. ఎందుకంటే శుభకార్యానికి పిలవడం విషయంలో మన సంప్రదాయాన్ని అనుసరిస్తాం. అయినా కూడా దానిని పక్కన పెట్టి ఈ మధ్య కాలంలో డిజిటల్ ఇన్విటేషన్స్ తో బంధువులను పిలుస్తున్నారు. కాగితాన్ని పొదుపు చేయాలన్న కాన్సెప్టు యువతలో ప్రత్యేక స్పూర్తిని నింపిందని చెప్పవచ్చు. లెటెస్టుగా పెళ్లి ఆహ్వాని ట్రెండ్ లో ఫేస్ బుక్ వెడ్డింగ్ కార్డులు బాగా పాపులర్ అయ్యాయి.

ఫేస్ బుక్ ఇన్విటేషన్ కార్డు అంటే ఏంటి?
కాగితాన్ని ఖర్చు చేయకుండా…ప్రజలకు కార్డులు పంచడం. ఇది డిజిటల్ ఆహ్వానాలకు ఆజ్యం పోసిందని చెప్పవచ్చు. దాదాపు ప్రతితరం ప్రజలు ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. వారి ప్రియమైనవారు ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు. ఫేస్ బుక్ వెడ్డింగ్ కార్డ్ దీన్ని ప్రయోజానాన్ని పొందింది. ఈ డిజిటల్ కార్డులో ఆహ్వానం వివరాలు మాత్రమే ఎంటర్ చేయాలి. ఎవరి పెళ్లి, ఎప్పుడు, ఎవరితో ఎక్కడ, ఏ రోజున…ఈ విషయాలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. అయితే ఇక్కడొక విశేషం ఏమిటంటే…ఇన్విటేషన్ పేజీని క్రియేట్ చేసిన తర్వాత ఇన్విటేషన్ అందుకున్న వారికి మాత్రమే ఫంక్షన్ కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.

ప్రయోజనాల ఏంటి…?
ఈ లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ…ఇలాంటి వినూత్న ఇన్విటేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. సంప్రదాయ కార్డుల మాదిరిగా కాకుండా…అందులో వధూవరులు ఫోటోలు ఉంటాయి. ఈ కార్డులను డిజిటల్ గా షేర్ చేసి ఇన్విటేషన్స్ ఇవ్వొవచ్చు. పేపర తోపాటు డబ్బు, సమయం కూడా ఆదా అవుతుంది. కోవిడ్ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.

వివాహాల ట్రెండ్…
ఈ రోజుల్లో ప్రతివ్యక్తి తన వివాహాన్ని చాలా డిఫరెంట్ గా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. వీటి మధ్య ఫేస్ బుక్ టెంప్లేట్ ప్రభావంతో పెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా ప్రింట్ అవుతున్నాయి. దీని థీమ్ డిజైనింగ్ అచ్చం ఫేస్ బుక్ మాదిరిగానే ఉంటుంది. అలాంటి కార్డుల కోసం ఆర్డర్లు కార్డ్ ప్రింటింగ్ కోసం కూడా వస్తుంటాయి.

బంధువుల రియాక్షన్ ఎలా ఉంటుంది.?
ఇక మనదేశంలో పెళ్లిళ్ల ట్రెండ్ మారింది. అయితే ఇన్విటేషన్స్ విషయంలో బంధువుల వైఖరిలో ఎలాంటి మార్పు లేదనే చెప్పవచ్చు. చాలామంది డిజిటల్ ఇన్విటేషన్స్ ను అంగీకరించరు. కానీ ఆధునిక ఆలోచనలు ఉన్నవారు మాత్రం స్వీకరిస్తున్నారు.