Thief Jumps Into Sea: స‌ముద్రంలోకి దూకిన దొంగ.. హెలికాప్ట‌ర్‌తో పోలీసులు చేజింగ్..!

దొంగత‌నం చేసిన దొంగ త‌ప్పించుకోవాట‌నికి ఎన్నోదారులు ఎంచుకుంటాడు.

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 01:06 AM IST

దొంగత‌నం చేసిన దొంగ త‌ప్పించుకోవాట‌నికి ఎన్నోదారులు ఎంచుకుంటాడు. కొన్ని సార్లు దొంగలు దొంగత‌నం చేసి దొర‌కుండా ఉండేందుకు ఎంత‌టికైనా తెగిస్తారు. అలా తెగించారు అంటే వారు దొంగిలించిన దాని వ‌స్తువు చాలా ఖ‌రీదైన‌ది అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు మ‌నం చ‌ద‌వ‌బోయే వార్త మాత్రం కాస్త డిఫ‌రెంట్ గా ఉంటుంది.

ఫ్లోరిడాలోని ఓ దొంగ ప‌ర్సు కొట్టేసి త‌ప్పించుకునేందుకు ఏకంగా సముద్రంలో దూకాడు. ఇది చూసిన స్థానికులు స్థానిక పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కొట్టేసింది చిన్న ప‌ర్స్ అయినా పోలీసులు వ‌దిలిపెట్ట‌లేదు. వెంట‌నే పోలీసులు హెలికాప్ట‌ర్‌లో దొంగ కోసం చేజింగ్ మొద‌లుపెట్టారు. ఈత కొడుతున్న దొంగను పోలీసులు గుర్తించారు. పోలీసుల‌ను చూసిన దొంగ ఏకంగా సముద్రంలో లోతుకు వెళ్లి త‌ప్పించుకునే ప్ర‌యత్నం చేశాడు. కానీ సాధ్యం కాక‌పోవ‌డంతో లొంగిపోతున్నా అంటూ చేతులు పైకి ఎత్తాడు.

అయితే చిన్న ప‌ర్స్ కోసం పోలీసులు చేసిన ఈ పనికి స్థానికులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 32 ఏళ్ల ఈ దొంగపై ఇప్పటికే క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఫన్నీ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. అక్టోబర్ 1వ తేదీన ఈ ఘటన జరిగింది.