Benz Car Theft : కత్తితో బెదిరించి బెంజ్ కారు దొంగతనం

ఓ వ్యక్తిని బెదిరించి మెర్సిడెస్ బెంజ్ కారును దొంగిలించిన ఘటన గురుగ్రామ్ (Gurugram) లో జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Benz Car

Benz Car

ఓ వ్యక్తిని బెదిరించి మెర్సిడెస్ బెంజ్ కారును (Benz Car) దొంగిలించిన ఘటన గురుగ్రామ్ (Gurugram) లో జరిగింది. గురుగ్రామ్ పరిధిలోని సెక్టార్ 29 ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, మూత్ర విసర్జన కోసం అంజు బేడీ అనే ఓ లాయర్ తన బెంజ్ కారును (Benz Car) రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు హ్యుందాయ్ కారులో (Hyundai Car) అటుగా వచ్చారు. తమ కారును బెంజ్ కారుకు అడ్డంగా నిలిపి, లాయర్ ను కత్తితో బెదిరించి, కారును దొంగిలించారు. ప్రాణ భయంతో లాయర్ ఏమీ చేయలేక పోయాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను మొదలు పెట్టారు.

Also Read:  Khushboo : ఖుష్బూ ఇంట విషాదం. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ మృతి

  Last Updated: 17 Dec 2022, 11:47 PM IST