Pakistan: పాక్ ఏజెంట్లకు సిమ్ ల సరఫరా… గుట్టురట్టు చేసిన పోలీసులు!

పాకిస్తానీ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అస్సాంలో అరెస్టు చేశారు. నాగౌన్, మోరిగాన్ జిల్లాల్లోని ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 09:32 PM IST

Pakistan: పాకిస్తానీ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అస్సాంలో అరెస్టు చేశారు. నాగౌన్, మోరిగాన్ జిల్లాల్లోని ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర ప్రమాదకర మెటీరియల్ స్వా ధీనం చేసుకొన్నారు. విదేశీ దౌత్య కార్యాలయానికి రక్షణశాఖ కీలక సమాచారం చేరవేసేందుకు వినియోగిస్తున్న ఓ హ్యాండ్ సెట్ కూడా దీనిలో ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఘటనపై అస్సాం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతినిధి ప్రశాంత భుయాన్ మాట్లాడారు. ఇంటెలిజెన్స్ బ్యూరో-ఐబీ, ఇతర మార్గాల్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 10 మందిని వివిధ సర్వీసు ప్రొవైడర్ల నుంచి తప్పుడు మార్గాల్లో సిమ్ కార్డులు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీటిల్లో కొన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

నిందితుల నుంచి 18 మొబైల్ ఫోన్లు, 136 సిమ్ కార్డులు, ఫింగర్ ప్రింట్ స్కానర్, హైటెక్ సీపీయూ, బర్త్ సర్టిఫికెట్లు, పాస్ బుక్స్, ఫొటోలు ఉన్నాయి. నిందితులను ఇంటరాగేషన్ చేయగా వారిలో ఒకరు రక్షణశాఖ సమాచారాన్ని పాకిస్తాన్ కు ఇస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అష్కిల్ ఇస్లాం అనే వ్యక్తి పాకిస్తాన్ కు వాట్సాప్ కాల్స్ చేస్తున్నట్లు తేలింది. అతడు భారత రక్షణ దళాల కీలక సమాచారం పాకిస్తాన్ కు అందించినట్లు గుర్తించారు. దీనిపై మరింత విచారణ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.