Crime: రీఛార్జ్ చేయ‌లేద‌ని కుమారుడు ఆత్మ‌హ‌త్య 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

  • Written By:
  • Updated On - April 20, 2022 / 04:35 PM IST

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. త‌న తండ్రి మొబైల్ డేటా రీఛార్జ్ చేయించ‌లేద‌న్న కోపంతో 14 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కున్నాడు. తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. బాలుడు తన మొబైల్ ఫోన్‌కు బానిస అయ్యాడని, డేటా ప్యాక్ గడువు ముగిసిన తర్వాత తన మొబైల్ ఫోన్‌కు రీఛార్జ్ చేయమని తండ్రిని పట్టుబట్టినట్లు విచారణలో తేలింది. తండ్రి తన మాట వినకపోవడంతో ఆ బాలుడు తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి తన మొబైల్ ఫోన్ డేటా ప్యాక్‌ను వేయించాల‌ని ప‌దే ప‌దే చెప్పిన‌ప్ప‌టికీ వేయించ‌కపోవ‌డంతో యువకుడు చినిపోవాల‌నుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి కూలి పని చేస్తూ కుటుంబ పోషణ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే తన కుమారుడి మొబైల్ ఫోన్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేయలేక పోతున్నాడని పోలీసులు తెలిపారు.