Harish Rao: కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది: మంత్రి హరీశ్ రావు

Harish Rao: కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ’’బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్  వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా […]

Published By: HashtagU Telugu Desk
Harish Rao

Harish Rao

Harish Rao: కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ’’బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్  వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు’’ అని మండిపడ్డారు.

‘‘ఇది ద్వంద్వ నీతి కాదా ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా ? గతంలో కూడా క్రీడా , సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ గారు రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు’’ హరీశ్ రావు ప్రశ్నించారు.

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ , బిజెపి రెండు పార్టీలు ఒక్కటై బిఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ గారు స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు , రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా చూపిస్తున్నారు’’ అని హరీశ్ రావు మండిపడ్డారు.

  Last Updated: 26 Jan 2024, 02:24 PM IST