Minister Ponnam: తెలంగాణ పునః నిర్మాణం లో ఎన్నారై ల పాత్ర ఎంతో అవసరమని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో కౌండిన్య గ్లోబల్ గౌడ ఎన్నారై మీట్ అండ్ గ్రీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నారై లను ఉద్దేశించి ప్రసంగించారు.తెలుగు ఎన్నారై రమేష్ గౌడ్ మండల ఆధ్వర్యములో మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఘనంగా ఆత్మీయ సత్కారించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఎన్నారై ల ఆత్మీయ సమ్మేళనంలో తనకు సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని, మీ ప్రేమ ఆప్యాయత తెలంగాణ పునర్నిర్మాణంలో అవసరం అని అన్నారు.
తెలంగాణ లో ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు..అవి విజయవంతంగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుందన్నారు.
ఈ కార్యక్రములో రవి ముళ్ళపూడి, సుదర్శన్, అమర్ అతికం,శేషు మల్లేపల్లి , సత్య పడమటి ,రఘు పలగాని, హరి బండిగారి ,రమేష్ కాచం, ఇతర తెలుగు సంఘాల ప్రతినిథులు పాల్గొన్నారు,