Site icon HashtagU Telugu

Twitter : ట్విట్టర్ హెడ్డాఫీసు పై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేసిన యజమాని

The Owner Sued Twitter Headquarters In A San Francisco Court

The Owner Sued Twitter Headquarters In A San Francisco Court

ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ (Twitter) ను చిక్కులు వీడట్లేదు. ఒక వివాదం ముగిసేలోపే మరొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా.. ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ ఆ కంపెనీపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ ట్విట్టర్ పై కోర్టు కెక్కింది. ట్విట్టర్ కంపెనీ 1.36 లక్షల డాలర్ల అద్దె బకాయిపడిందని ఆరోపిస్తోంది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలోని హార్ట్ ఫోర్డ్ బిల్డింగ్ లో 30 వ అంతస్థులో ఉంది. ఈ బిల్డింగ్ సొంతదారు కొలంబియా రెయిత్ నుంచి ట్విట్టర్ అద్దెకు తీసుకుంది.

అయితే, ఇటీవల కొన్ని వారాల నుంచి ట్విట్టర్ అద్దె చెల్లించట్లేదని కొలంబియా రెయిత్ ఆరోపించింది. దీనిపై గత నెల 16న ట్విట్టర్ (Twitter) కు నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్విట్టర్ పై కోర్టులో దావా వేసినట్లు ఓ ప్రకటనలో వివరించింది. కాగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన అద్దె కూడా ట్విట్టర్ చెల్లించడంలేదని సమాచారం. దీనిపై పలు మీడియా సంస్థలు ట్విట్టర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆ కంపెనీ స్పందించలేదు.

Also Read:  Andhra Pradesh : వలంటీర్ల సమావేశం లో తొడగొట్టిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం