Corona Updates: కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది!

  • Written By:
  • Publish Date - January 25, 2022 / 11:36 AM IST

గత నాలుగు రోజులుగా కరోనా కేసులు మూడు లక్షలకు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కొత్త కేసులు మూడు లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. అంటే భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.