Beast Car: ఏరోప్లేన్ ఇంజన్ అమర్చిన బీస్ట్ కారు లుక్ మామూలుగా లేదుగా.. వైరల్ ఫోటో?

చాలావరకు పెద్ద పెద్ద కార్లు రకరకాల ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లతో తయారవుతూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 08:31 PM IST

Beast Car: చాలావరకు పెద్ద పెద్ద కార్లు రకరకాల ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లతో తయారవుతూ ఉంటాయి. ఇప్పటికీ బ్రిటిష్ లగ్జరీ కారు కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లను రూపొందిస్తూనే ఉంది. ఇక ఆ కంపెనీ తయారు చేసిన మెర్లిన్ ఇంజిన్ ఎంతో శక్తివంతమైనదని పేరు కూడా తెచ్చుకుంది. అయితే 1971 దశకంలో మెర్లిన్ ఇంజిన్ ను అమర్చిన కారు ఇప్పుడు వేలం పాటలో ముందుకు.

అయితే ఆ కారు ఇప్పుడు ఎక్కడుంది.. ఎవరు తయారు చేశారు.. అసలు ఎంత వేగంతో దూసుకుపోతుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ కారు 1972లో బ్రిటన్ లో బీస్ట్ గా రిజిస్టర్ అయ్యింది. మొదట ఇంగ్లీష్ ఇంజనీర్ పాల్ జేమ్సన్ ఒక స్ట్రీట్ లీగల్ కస్టమ్ కారులో ట్యాంక్ ఇంజిన్ మార్చడం వల్ల ఏం జరుగుతుందో అని తయారు చేశాడు.

దానికి రోల్స్ రాయిస్ మిటియోర్ ట్యాంక్ ఇంజిన్ ను బిగించాడు. ఇక ఆ విషయం జాన్ డూడ్ కు తెలియటంతో ప్రాజెక్టు గురించి తెలుసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిన జేమ్సన్ మధ్యలోనే వదిలేశాడు. ఇక జాన్ ఆ కారును తయారు చేయటం మొదలుపెట్టాడు. అన్ని భాగాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి పైకి కనిపించే కారు బాడిని ఫైబర్ గ్లాస్ తో తయారు చేయించాడు.

అలా 1972లో బీస్ట్ కారును సిద్ధం చేసి రోడ్డుపైకి నడిపించాడు. ఈ కార్ ని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. అయితే ఐరోపాలు జరిగిన టెలివిజన్ కార్యక్రమంలో ఈ కారును ప్రదర్శించగా 1974లో స్వీడన్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. దానివల్ల జాన్ కు తీవ్ర నష్టం ఏర్పడింది. అయినప్పటికీ ఆయన అంతటితో పోరాటం ఆపలేదు.

ఆ కారుకు పూర్వరూపం తీసుకురావడానికి కష్టపడ్డాడు. ఇక కారుకు రోల్స్ రాయిస్ 27 లీటర్ల మెర్లిన్ v12 ఏరోప్లేన్ ఇంజిన్ బిగించాడు. ఈ ఇంజన్ 750 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలా కారు మొత్తం 2280 కేజీల బరువు ఉండేది. ఇక ఫైబర్ గ్లాస్ రిపేర్ అనే కంపెనీ వద్ద బాడీని తయారు చేయించాడు. అలా 19 అడుగుల పొడవైన కారణం మళ్ళీ తయారు చేశాడు.

దీంతో 1977లో ది మోస్ట్ పవర్ఫుల్ కార్ ఇన్ ది వరల్డ్గా గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. అయితే ఆ సమయంలో ఈ కారు గంటకు 418 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది అని ప్రచారం జరిగింది కానీ దాని అసలు వేగం ఏంటో ఇప్పటికీ తెలియలేదు. అయితే జాన్ బీస్ట్ ను తన కంపెనీ కారుగా ప్రచారం చేసుకుంటున్నాడు అని రోల్స్ రాయిస్ దావా వేసింది.

ఇక ఆ కేసులో కంపెనీ గెలిచింది. దీంతో ఆ తర్వాత జాన్ బ్రిటన్ వదిలి స్పెయిన్ కి వెళ్ళిపోయాడు. ఆ కారును కూడా తనతో తీసుకొని వెళ్ళాడు. ఇక చివరి శ్వాస వరకు ఆ కారును తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇక ఈయన గత ఏడాది మరణించగా అయినా కుటుంబ సభ్యులు ఈ పురాత కారుని వేలం వేయించాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ కారు స్పీడోమీటర్ 16,093 కిలోమీటర్ల వద్ద ఉందని.. కండిషన్ కూడా బాగానే ఉంది అని తెలిసింది. ఇక ఈ కారును 87800 డాలర్లకు వేలం పలికిందని తెలిసింది. అంటే దాదాపు రూ.72 లక్షలకు పైనే ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం ఆ కారు ఫోటో వైరల్ గా మారగా దాని లుక్ మామూలుగా లేదని చూసిన వాళ్ళు అంటున్నారు.