Richest people: ప్రపంచ సంపన్నుల జాబితా విడుదల.. అంబానీ, అదానీ స్థానం ఎంతో తెలుసా!

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ను ప్రకటించింది. సంపన్నుల జాబితాను విడుదల చేసింది. భారత్ సంబంధించిన వ్యక్తులు ఈ లీస్ట్ లో ఉన్నారు. అత్యంత సంపన్న భారతీయ టైటిల్ ను గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ముఖేష్ అంబానీ సొంతం చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - March 22, 2023 / 09:48 PM IST

Richest people: హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ను ప్రకటించింది. సంపన్నుల జాబితాను విడుదల చేసింది. భారత్ సంబంధించిన వ్యక్తులు ఈ లీస్ట్ లో ఉన్నారు. అత్యంత సంపన్న భారతీయ టైటిల్ ను గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ముఖేష్ అంబానీ సొంతం చేసుకున్నారు. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో
అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.

మరోవైపు తొమ్మిదో స్థానంలో ఉన్న అంబానీ ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కావడం విశేషం. అంబానీ తన సంపదలో 20 శాతం కోల్పోయినప్పటికీ, 82 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలబడ్డారు.

ఇక తీవ్ర హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ తీవ్రంగా నష్టపోయారు. తన మార్కెట్ విలువ అమాంతం తగ్గిపోయింది. తన ర్యాంకింగ్ ని కూడా భారీగా దిగజార్చుకున్నాడు. ఈయన ర్యాంకింగ్ జాబితాలో 53కి పడిపోయారు.ఈ రిపోర్ట్ వెలువడక ముందు అదానీ ప్రపంచ కుబేరుల లిస్ట్‌లోనే 2వ స్థానంలో ఉన్నారు. అదానీ ఇప్పుడు దాదాపు USD 53 బిలియన్ల సంపదతో భారతీయ సంపన్నుల జాబితాలో రెండవ స్థానానికి పడిపోయారు.

ఇక హురున్ జాబితా ప్రకారం సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావల్లా దాదాపు USD 27 బిలియన్ల సంపదతో మూడవ అత్యంత సంపన్న భారతీయుడు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్ USD 26 బిలియన్ల సంపదతో నాల్గవ సంపన్న భారతీయులుగా అవతరించారు. USD 25 బిలియన్లతో ఆర్సెలార్ మిట్టల్‌కు చెందిన లక్ష్మిఎన్ మిట్టల్ ఐదో స్థానంలో ఉన్నారు.