Site icon HashtagU Telugu

The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్‌కు ప్రమాదం

Medium 2023 05 14 5b2c32926f

Medium 2023 05 14 5b2c32926f

The Kerala Story: ఇటీవల దేశవ్యాప్తంగా రాజకీయంగా వివాదాన్ని చెలరేపిన ది కేరళ స్టోరీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఆదా శర్మకు ప్రమాదం జరిగింది. ఆమెతో పాటు సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్‌కి కూడా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డైరెక్టర్ సుదీప్తో సేన్‌కు స్వల్ప గాయాలయయాయి. ఈ విషయాన్ని సుధీప్తో సేన్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో తెలిపారు.

ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంగనర్ లో హిందూ ఏక్తాయాత్రకు శ్రీకారం చుట్టారు. అత్యంత ఘనంగా ఈ యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్రకు ఆదా శర్మ, సుధీప్తో సేన్ ని ఆహ్వానించారు. దీంతో వారిద్దరు కరీంనగర్ లో జరగనున్ హిందూ ఏక్తా యాత్రకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. యాత్రకు వస్తుండగా ప్రమాదం జరగింది. దీంతో నేడు కరీంనగర్ లో జరగనున్న యాత్రకు రాలేకపోతున్నట్లు సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు.

ఈ రోజు కరీంనగర్ లో జరగాల్సిన యాత్రకు హాజరుకావాల్సి ఉందని, కానీ కొన్ని ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూల వల్ల యాత్రకు రాలేకపోతన్నట్లు తెలిపారు. కరీంనగర్ ప్రజలు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు. తాము తీసిన ది కేరళ స్టోరీ సినిమా ఆడపిల్లలను కాపాడటానికే తీసినట్లు తెలిపారు. హిందూ ఎక్తా యాత్రకు మద్దతు ఇవ్వండి అని సుదీప్తో సేన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అయితే ఈ వివాదాస్పద సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. వారంలోపే రూ.113 కోట్లు రాబట్టింది. సెకండ్ వీక్ కు రూ.200 కోట్ మార్క్ కు చేసుకునే అవకాశముంది. కేరళలో లవ్ జిహాద్ కు 32 వేల మంది అమ్మాయిలు బలైనట్లు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ది ఇద్నాని కీలక పాత్రలలో నటించారు.