Site icon HashtagU Telugu

The Kashmir Files on OTT: ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ అప్ డేట్..!!

Kashmir Imresizer

Kashmir Imresizer

‘ది కశ్మీర్ ఫైల్స్’ఈ మూవీ మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఎలాంటి ప్రమోషన్లను లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన సంచలనం క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవిజోషీ వంటి ఎంతోమంది బాలీవుడ్ నటులు ఈ మూవీలో నటించారు. ప్రధాని మోదీ ఈ సినిమాను చూసిన చిత్ర యూనిట్ ను అభినందించారు. ఎంతో మంది ప్రముఖలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దాదాపు 250కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు ఈ మూవీ OTTలో ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి అందరీలోనూ నెలకొంది. ది కశ్మీర్ ఫైల్ మూవీ OTTరిలీజ్ మే నెలలో జీ 5లో రిలీజ్ కానుంది. తొందర్లో మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాకు పలు రాష్ట్రాల్లో ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, కర్నాటక, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మినహింపు ఇచ్చారు. ఇక అస్సాం ప్రభుత్వం అయితే ఈ సినిమా కోసం తమ ఉద్యోగులకు సెలవులు కూడా ప్రకటించింది. ఈ మూవీ రివ్యూలు ఎక్కడచూసినా పాటిజివ్ గా వచ్చాయి. విమర్శకులుకూడా ప్రశంసలు కురిపించారు.

Exit mobile version