Site icon HashtagU Telugu

Ola: ఒక్క చేదు సంఘటన వల్ల వచ్చిన ఐడియానే ఇప్పుడు వేల కోట్ల ‘ఓలా’

Ola

Ola

Ola: నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు అందరూ ఓలా బైక్, ఓలా ఆటో, ఓలా క్యాబ్ అనే పేరునే జపం చేస్తున్నారు. ఎంతోమంది ప్రజలకు వారి సేవలు అందిస్తూ అలాగే ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్న ఓలా ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఇప్పుడు కొన్ని వేల కోట్ల కంపెనీగా ఎదిగిన ఈ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పంజాబ్ లోని లూథియానాలో పెరిగిన భవిష్ 2008లో ఐఐటి బాంబే నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఇక అదే సంవత్సరం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియాలో రీసెర్చ్ ఇంటర్న్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అగర్వాల్ అక్కడ రెండేళ్లు పనిచేశాడు.

ఇక భవిష్ కు ఈ ఓలా ఆలోచన ఎలా వచ్చిందంటే… ఒకసారి భవిష్ తన స్నేహితులతో కలిసి టూర్ ప్లాన్ చేసుకుంటే అద్దెకి తీసుకున్న టాక్సీ వాడు మధ్యదారిలో బండి ఆపేసి ప్రయాణ ఖర్చులు సరిపోవని వారికి అధిక డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో వారిని మధ్యదారిలో వదిలేసి వెళ్లిపోయాడు. వెంటనే భవిష్ అగర్వాల్ ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు అని తెలుసుకున్నాడు.. దానికి పరిష్కారంగా పుట్టిన ఆలోచనే ఓలా. వాళ్ళ

మొదట్లో భవిస్ కుటుంబ సభ్యుల నుండి అతనికి అంత మద్దతు లభించలేదు. ఇక 2017లో నెలకు లక్షల్లో వస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని సైతం ధైర్యంగా రాజీనామా చేసి తన ఐడియా మీద నమ్మకంతో ముందుకు సాగాడు భవిస్. ఇక తన స్నేహితుడైన అంకిత్ భాటియాతో కలిసి ప్రారంభించిన ఈ ఓలా సంస్థ ఇప్పుడు 15 లక్షల మందికి పైగా టాక్సీ డ్రైవర్లు ఉపాధి కల్పిస్తోంది.