Site icon HashtagU Telugu

Civil Servants: చల్లారని సివిల్‌ సర్విసెంట్ల వేడి… కోటి రూపాయల పరునష్టం దావా!

Ias Ips Fight

Ias Ips Fight

Civil Servants: కర్ణాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణుల మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్ ఫేస్‌బుక్‌లో ఓ  పోస్టు పెట్టగా.. అందుకు రిప్లై ఇస్తూ రోహిణి సింధూరి రూపాకు లీగల్ నోటీసులు పంపింది. బేషరతుగా లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం కల్గించినందుకు పెద్దమెుత్తం డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారి మృతి చెందగా, తమిళనాడులో ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ఐఏఎస్‌ అధికారుల జంట విడాకులు తీసుకుంది. అందుకే నేను జాగ్రత్త పడుతున్నా’ అని రూపా తన పోస్టులో రాశారు. ఎవరి పేరును బహిర్గతం చేయకుండా తాను చెప్పాల్సిన అంశాలను పరోక్షంగా పోస్టులో రాసుకొచ్చారు. అయితే రూపా మౌద్గిల్‌తోపాటు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి ఆరోపణలను చేసుకోవద్దని బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితాశర్మ ఇప్పటికే ఆదేశించారు.

ఇద్దరినీ బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. అయినా రూపా మౌద్గిల్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం గమనార్హం. రికీ ఆ శక్తి ఉండదు. అలాంటి మహిళల కోసం గొంతు కలుపుదాం. కుటుంబ విలువలకు భారతదేశం పెట్టింది పేరని దానిని కొనసాగిద్దామన్నారు. ఇది మరో సంచలనం అయింది. తమ కుటుంబం బాగుండాలి కాబట్టే నేను ఇలా పోరాడుతున్నానని అన్నారు.తాను, తన భర్త ఇంకా కలిసి ఉన్నామని ఊహాగానాలు వద్దని స్పష్టం చేశారు.

సామాజిక కార్యకర్త గంగరాజుతో జరిగిన ఆడియో సంభాషణపై రూపా మౌద్గిల్ వివరణ ఇచ్చారు.నేనెప్పుడూ అవినీతి కోసం పని చేయలేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఆపమని నేను గంగరాజుకు చెప్పలేదు. ఆడియోపై అనవసరంగా చర్చ జరుగుతోంది. రోహిణి సింధూరి అవినీతి గురించి మాత్రమే చర్చ జరగనివ్వండి. కుటుంబ,వ్యక్తిగత అంశాలు ఇక్కడ చర్చకు రాకూడదని వ్యాఖ్యానించారు. అయితే రోహిణి సింధూరి.. రూపాకు లీగల్ నోటీసులతో షాక్‌ ఇచ్చింది. బేషరుతుగా క్షమాపణలు చెప్పాలంది. ఇలా చేయని పక్షంలో, కోటి రూపాయలు చెల్లించాలని పరునష్టం దావా వేసింది. ఇది చూస్తున్న వాళ్లంతా.. ఇప్పట్లో వీరిద్దరి మధ్య మంట చల్లారేలా లేదని అంటున్నారు.

Exit mobile version