Site icon HashtagU Telugu

Flight Late: విమానం ఆలస్యం.. సారీ చెప్పేందుకు జపాన్ నుంచి తైవాన్ వచ్చిన సంస్థ అధినేత!

Af0085aea6

Af0085aea6

Flight Late: వ్యాపారస్తులకు కస్టమర్లే దేవుళ్లు అంటారు. కస్టమర్లతో మంచిగా ఉంటేనే ఏదైనా బిజినెస్ సక్సెస్ అవుతుంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి. కస్టమర్లతో రిలేషన్ మెయింటెన్ చేస్తూ ఉండాలి. కస్టమర్లతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వ్యాపారం బాగా సాగుతుంది. ఒక ఎయిర్ లైన్స్ అధినేత కూడా అదే పనిచేశాడు. తన కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని తెలుసుుని వెంటనే స్పందించాడు.

ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఓ ఎయిర్‌లైన్స్ అధినేత వారికి సారీ చెప్పాడు. ఇందుకోసం తైవాన్ నుంచి జపాన్ కు వచ్చాడు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో చోటుచేసుకుంది.స్టార్ లక్స్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఓ విమానం నరిటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తైవాన్ రాజధాని తైపీ వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యం విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులను వేరే విమానంలోకి ెక్కించారు.

అయితే రెండో విమానం కూడా ఆలస్యమైంది. దీంతో అర్థరాత్రి వరకు ప్రయాణికులు విమానంలోనే ఉన్నారు. రాత్రి దాటిన తర్వాత విమానం రద్దు అయిందని చెప్పడంలో ప్రయాణికులు రాత్రి అంతా ఎయిర్ పోర్ట్ లోనే గడపాల్సి వచ్చింది. దీంతో దాదాపు 300 మంది ప్రయాణికులను రాత్రంతా ఇబ్బంది పడ్డారు. దీంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి సంస్థ అధినేత చాంగ్ కు తెలుసుకున్నాడు. వెంటనే తైవాన్ నుంచి జపాన్ బయలుదేరాడు. ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పాడు. ప్రయాణికులకు డబ్బులు పూర్తిగా రీఫండ్ ఇస్తామన చెప్పాడు. ఆ తర్వాత వేరే విమానంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చారు.