Site icon HashtagU Telugu

BRS: ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం జీవోలు వెంటనే విడుదల చేయాలి

Telangana

Telangana

BRS: రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చాం, దేశంలోని 32 రాజకీయ పార్టీల దగ్గరకు తిరిగి, 28 పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చాం, రాజ్యాధికారం కోసం ఆనాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టలేదని, నీళ్లు,నిధులు, నియామకాల కోసం టీఆర్ఎస్ పార్టీని పెట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్నీ సాధించడం జరిగిందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం కరీంనగర్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ వ్యూహరచన చేయబోతున్నారని పేర్కొన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు..అబద్ధాల పునాదిపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశ్యం బీఆర్ఎస్ కు లేదని…ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం వెంటనే ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్ లైన్ చేయడం లేదని, ₹లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు దరఖాస్తులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. యాసంగి సీజన్ లో రైతులకు క్వింటాలు కు ₹500ల బోనస్ ఇస్తామని చెప్పారని, యాసంగి. పంట ను ఏప్రిల్, మే. మాసాల్లో విక్రయించగానే రైతులు ప్రభుత్వాన్ని బోనస్ డబ్బులు అడగడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ₹2500లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల అమలు కోసం జీవో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. 2014 నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ కోసం ₹ వెయ్యి కోట్లు తీసుకోచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఐదేళ్ల పదవి కాలంలో కరీంనగర్ కు బండి సంజయ్ నయాపైసా తేలేదని అన్నారు.

కరీంనగర్ అభివృద్ధి కోసం ఐదు కొత్తలు తెలేని బండి సంజయ్ కి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని అన్నారు. తీగలగుట్ట పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలంటే కేంద్రం నోరుమెదపలేదని,తీగలగుట్టపల్లి గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్ లో కలిపితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర రోడ్డు నిధుల కింద రైల్వే ఓవర్ బ్రీడ్జి మంజూరు చేశారని,తెలంగాణ లో 20 ఆర్ఓబీలు అడిగితే ఐదు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. వలవేసి కుందేళ్లను పడతారు కానీ…పులిని వలవేసి ఎలా పడతారో రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. పదేళ్ళలో తెలంగాణ లో 24 గంటల కరెంటు, కోటి ఎకరాలకు కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణం చేసి నీళ్లివ్వడం జరిగిందన్నారు. మరో వైపు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును సిరసావహిస్తామని పేర్కొన్నారు.

Exit mobile version