Zomato: జొమాటో కు షాకిచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు లైన్ లోకి వచ్చిన సంస్థ?

గత కొంతకాలం నుండి ఎక్కడ చూసినా జొమాటోనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి జొమాటో అమ్మ చేతి వంట కంటే ఎక్కువైపోయింది. పొద్దున్నే లేచినప్పటి నుంచి టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని అక్కడి నుంచే ఆర్డర్ చేసుకుంటున్నారు జనాలు.

  • Written By:
  • Publish Date - April 17, 2023 / 07:02 PM IST

Zomato: గత కొంతకాలం నుండి ఎక్కడ చూసినా జొమాటోనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి జొమాటో అమ్మ చేతి వంట కంటే ఎక్కువైపోయింది. పొద్దున్నే లేచినప్పటి నుంచి టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని అక్కడి నుంచే ఆర్డర్ చేసుకుంటున్నారు జనాలు. దీంతో జొమాటో కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. కానీ జొమాటోలో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం ప్రతిరోజు నిరాశతోనే బతుకుతున్నారు.

మామూలుగా ఈ డెలివరీ స్టార్టప్స్ అనేవి ‘ఆలస్యం విషం.. వేగమే అమృతం’ అనే ఫార్ములాను ఫాలో అవుతూ ఉంటుంది. అందుకే ఫుడ్ ని డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అనుకున్న సమయంలోపే ఫుడ్ డెలివరీ చేయాలి అన్న అంశంపై పనిచేస్తున్నారు. దీంతో డెలివరీ సంస్థలు కూడా మాటకు పది నిమిషాలనే అంటున్నాం కానీ.. తమ సగటు డెలివరీ సమయం 8 నిమిషాలకు పైచిలుకే అంటూ డైలాగులు కొడుతున్నాయి.

అంత త్వరగా ఫుడ్ డెలివరీ చేయాలంటే డెలివరీ బాయ్ కి వచ్చే కష్టం అంతా ఇంతా కాదు. మధ్యలో బైక్ ట్రబుల్ ఇవ్వడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలా ఏవో ఒకటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా సమయాన్ని మాత్రం మించడం లేదు. కానీ ఏం లాభం.. తమ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం దక్కట్లేదు అని వాపోతున్నారు జొమోటోకి చెందిన ‘బ్లింకిట్’ ఉద్యోగులు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగారు బ్లింకిట్ యాప్ కి చెందిన సిబ్బందులు. తమకు తాము చేస్తున్న పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున సమ్మె చేసి డెలివరీ చేయడమే మానేశారు. దీంతో దేశవ్యాప్తంగా 400 స్టోర్ల నుంచి సర్వీస్ అందిస్తున్న ఈ సంస్థ.. ఉద్యోగుల సమ్మెతో పదుల సంఖ్యలో స్టోర్లు మూతపడ్డాయి. ఇక ఆ సమ్మెకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఇటీవలే బ్లింకిట్ కొత్త చెల్లింపుల పద్ధతి అమలు చేసిందని.. ఆ నిర్ణయం వల్లే గతంలో డెలివరీ చేసిన ఆర్డర్లకు పొందే వేతనాలు బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలో జొమాటో ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. ఇక అందులో రైడర్ల కోసం కొత్త చెల్లింపుల పద్ధతి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ పద్ధతిలో చేసే డెలివరీల ఆధారంగా చెల్లింపులు ఉంటాయని.. షట్ డౌన్ చేసిన స్టోర్లను తిరిగి ప్రారంభించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది.