Site icon HashtagU Telugu

Elephant Traffic Rule : రోడ్డు మీద పెట్టిన బైక్ ని విసిరి పారేసిన ఏనుగు

The Elephant Threw The Bike On The Road

The Elephant Threw The Bike On The Road

బెంగళూరులోని ఓ రోడ్డుపై ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ బైక్ (Bike) ను తొండంతో విసిరిపారేసింది. ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరు డీసీపీ(ట్రాఫిక్) కళా కృష్ణస్వామి ఈ వీడియోను షేర్ చేస్తూ.. రోడ్లపై వాహనాలు పార్క్ చేయొద్దని కోరారు.

వీడియోలో కనిపిస్తున్న వివరాల ప్రకారం ఈ ఘటన కిందటి ఏడాది అక్టోబర్ లో జరిగింది. సిటీలోని ఓ రోడ్డుపై మూడు ద్విచక్రవాహనాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి రోడ్డు మీదే ఉండగా.. మిగతా రెండు మాత్రం కాస్త పక్కగా ఫుట్ పాత్ పైన పార్క్ చేశారు. ఇంతలో అక్కడికి ఓ ఏనుగు (Elephant) పరుగులు పెడుతూ వచ్చింది. దానిని చూసి అక్కడున్న జనం పరుగులు తీయగా.. ఆ ఏనుగు మాత్రం రోడ్డు మీద పార్క్ చేసిన బైక్ ను తొండంతో విసిరేసింది. ఆ పక్కనే ఉన్న రెండు వాహనాల జోలికి మాత్రం వెళ్లలేదు. అంతే.. వచ్చిన పని అయిపోయినట్లు తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

Also Read:  Food Habits : మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా?

రోడ్డు మీద పార్క్ చేసిన వాహనాలను ట్రాఫిక్ సిబ్బంది తీసుకెళ్లినట్లే.. ఈ ఏనుగు సింపుల్ గా పక్కకు విసిరేసి రోడ్డును క్లియర్ చేసింది. బెంగళూరు డీసీపీ(ట్రాఫిక్) కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో కొత్తగా విధుల్లో చేరిన ఏనుగు అని కొందరు.. చివరికి ఏనుగుకు కూడా ట్రాఫిక్ రూల్స్ తెలుసని మరికొందరు, బెంగళూరులో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏనుగులే మంచి ఆప్షన్ అని వ్యాఖ్యానిస్తూ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు.