Site icon HashtagU Telugu

Contraceptive Pills: గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా.. అయితే తస్మత్ జాగ్రత్త!

health skin

health skin

ఈ మధ్యకాలంలో గర్భనిరోధక మాత్రల వాడకం చాలా పెరిగింది. ఈ మాత్రలను ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ మాత్రల వల్ల కలిగే లాభాల సంగతి పక్కనపెడితే…ఎన్నో నష్టాలున్నాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ మాత్రలను వాడినట్లయితే..శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ముఖ్యంగా హార్మోన్ అసమతుల్యత సమస్య వస్తుందని పేర్కొంటున్నారు వైద్యులు.

ఇథినైల్ ఎస్ట్రాడియోల్, సింథటిక్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లు గర్భనిరోధక మాత్రల్లో ఉంటాయట. ఈ మాత్రల్లో ఉండే ఇథినైల్ ఎస్ట్రాడియోల్ వల్ల పిండం పెరగదు. అంతేకాదు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా చేస్తుంది. కానీ లాభాలకంటే నష్టాలే ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

గర్భనిరోధక మాత్రలు 1960లో వెలుగులోకి వచ్చాయి. వీటిని వాడటం వల్ల గర్భం దాల్చకపోవడం…తమ నియంత్రణలో ఉంటుందని భావిస్తుంటారు. కానీ వాటిని తరచుగా వాడటం వల్ల కలిగే దుష్ర్పభావాలను గుర్తించండం లేదు. కొన్ని అధ్యయనాల ప్రకారం…భారత్ లో ఏడాదికి 1.5 కోట్ల మంది కంటే ఎక్కువ ఆడవారు గర్భస్రావాల బారిన పడుతున్నారని తేలింది. వీళ్లలో 75శాతం మంది డాక్టర్లను సంప్రదించకుండానే గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారట.

ఈ మాత్రలు వాడటం వల్ల వాంతులు, తీవ్రమైన తలనొప్పి, వికారం, డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడుతున్నారని తేలింది. అంతేకాదు నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉందట. నెలసరి సమయం పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. 25 నుంచి 45లోపు వయస్సున్న వారు గర్బనిరోధక మాత్రలను అస్సలు వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కౌమార దశలో వీటిని వాడినట్లయితే..వారి రిప్రొడెక్టివ్ సిస్టమ్ పై చెడు ప్రభావం పడుతుందట. హార్మోన్ లెవల్స్ ఉండవు. ఈ మాత్రల వల్ల కొంతమంది ఆడవారు బరువు పెరుగుతున్నారట.

మధుమేహం, ఊబకాయం సమస్యలున్నవారు ఈ ట్యాబ్లెట్లను వాడకూడదు. స్మోకింగ్ చేసే ఆడవాళ్లు గర్భనిరోధక మాత్రలు వాడటం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత రోగాలు, అధిక రక్తపోటు సమస్యలున్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి.

ఇంకో విషయం మీకు తెలుసా..గర్భనిరోధక మాత్రలు పది సంవత్సరాలకు పైగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 60శాతం కంటే ఎక్కువగా ఉంటుందట. గర్భనిరోధక మాత్రలు వాడాలనుకుంటే…వైద్యుల పర్యవేక్షణలో వాడటం మంచిది. వైద్యులు సూచించిన విధంగా ఉపయోగిస్తే..ఎలాంటి అనర్థాలు జరగవు.

Exit mobile version