Site icon HashtagU Telugu

Doctor : ఆరేళ్ల బాబు చేసిన విజ్ఞప్తి మనసును కదిలించిందన్న డాక్టర్

The doctor said that the six-year-old Babu's plea was mind-blowing

The Six Year Old Babu's Plea Moved The Doctor

ఆటపాటలే లోకంగా బతికే ఆరేళ్ల బాబుకు అరుదైన క్యాన్సర్ వచ్చింది. ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకడని వైద్యులు చెప్పారు. బిడ్డే లోకంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులు దీనిని తట్టుకోలేకపోయారు. అయితే, కొడుకుకు ఈ విషయం తెలియొద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఆ పిల్లాడి నోటా అదే విజ్ఞప్తి. తనకు నిజం తెలుసనే సంగతి తన తల్లిదండ్రులకు చెప్పొద్దని వైద్యులను కోరాడు. ఆరేళ్ల బాబు ఇలా అడిగడంతో షాక్ కు లోనయ్యాడా డాక్టర్ (Doctor) కాసేపటిదాకా తన నోటమాట రాలేదని చెప్పాడు. ఈ సంభాషణను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడా డాక్టర్..

హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ తన ట్విట్టర్ లో ఈ వివరాలు పంచుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆరేళ్ల కుర్రాడు మనూను చెకప్ కోసం పేరెంట్స్ తన దగ్గరకు తీసుకొచ్చారని డాక్టర్ సుధీర్ చెప్పారు. రిపోర్టులు పరిశీలించాక మనూ పేరెంట్స్ తో విడిగా మాట్లాడానని.. తమ కొడుకుకు క్యాన్సర్ విషయం తెలియనివ్వొద్దన్న పేరెంట్స్ విజ్ఞప్తిని మన్నించినట్లు తెలిపారు. ఆ తర్వాత మనూ కూడా తనతో ప్రైవేటుగా మాట్లాడాడని, అప్పుడు మనూ అడిగిన ప్రశ్న తనను షాక్ కు గురిచేసిందని చెప్పారు.

Also Read:  Elephant Traffic Rule : రోడ్డు మీద పెట్టిన బైక్ ని విసిరి పారేసిన ఏనుగు

‘డాక్టర్ (Doctor) నాకు క్యాన్సర్ అని, మరో ఆరు నెలలకంటే ఎక్కువ కాలం బతకననీ తెలుసు. ఐపాడ్ లో చదివి ఈ వ్యాధి గురించి తెలుసుకున్నా. కానీ నాకు నిజం తెలుసనే విషయం మా అమ్మానాన్నలకు చెప్పొద్దు. ప్లీజ్’ అని మనూ కోరాడని డాక్టర్ సుధీర్ చెప్పారు. అయితే, మనూకు ఇచ్చిన మాటను తను నిలబెట్టుకోలేకపోయానని తెలిపారు. వెంటనే మనూ పేరెంట్స్ ను లోపలికి పిలిచి మరోమారు ఒంటరిగా మాట్లాడినట్లు వివరించారు. ఈ విషయం మనూ పేరెంట్స్ కు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ సుధీర్ తెలిపారు.