Site icon HashtagU Telugu

Aadhar Link: మార్చి 31 వరకే గడువు… ఈ పనులు చేయకుంటే నష్టపోతారు!

PAN-Aadhaar Card

PAN-Aadhaar Card

Aadhar Link: సగటు వేతన జీవులతో పాటు ఆదాయపు పన్ను చెల్లించే వారికి మార్చి నెల ఎంతో ముఖ్యమైనది. ఈ నెలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పన్ను మినహాయింపులు కల్పించే పెట్టుబడుల కోసం చూస్తుంటారు చాలా మంది. వాటితో పాటు ప్రభుత్వం సైతం పలు రకాల సేవలకు మార్చి 31 గడువు విధించింది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ ను గడువు కూడా ఆరోజుకే ఉంది.

పాన్ కార్డు హోల్డర్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం పాన్‌తో ఆధార్ నంబర్ లింక్ చేయడం. మార్చి 31తో దీనికి గడువు ముగుస్తుంది. ఇప్పటికీ పాన్ ఆధార్ లింక్ చేయని వారు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరోవైపు.. మార్చి 31,2023 తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే ట్వీట్ చేసింది.

దీంతో ఇప్పటికే చేసుకోని వారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యి రూపాయిలు పెనాల్టీతో ప్రస్తుతం కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఇప్పుడు చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకొని లింక్ చేసుకుంటున్నారు. ఇక మార్చి 31 తర్వాత అయితే 10 వేల ఫైన్ విధింపు ఉంటుందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. సుమారు ఏడాదిన్నరపాటు పదే పదే చెబుతున్నామని గుర్తు చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఆలస్య రుసుముతో చెల్లించాలని వెల్లడించింది.

Exit mobile version