Komatireddy Venkat Reddy: నాకు సీఎం అయ్యే రోజు వస్తుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో సీఎం పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్య నేతలు సీఎం పదవీపై కన్నేయడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

Published By: HashtagU Telugu Desk
Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

Komatireddy Venkat Reddy: ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో సీఎం పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్య నేతలు సీఎం పదవీపై కన్నేయడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారా.. పార్టీ మైలేజీ కోసం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తెలియడం లేదు. ఇటీవలనే వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి తాను ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించగా, తాజాగా స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యే రోజు వస్తుందని, ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడే సీఎం కావాలనే తొందర లేదన్నారు.  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈరోజు నల్లగొండ జిల్లాలో నామినేషన్‌ దాఖలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ అవినీతి పాల్పడిందనడానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబ సభ్యలుంతా లాభపడ్డారని.. ఆ ప్రాజెక్టును ఏటీఎంలా వినియోగించుకున్నారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పోలింగ్ చివరి రోజు రైతుబంధు డబ్బులు వేస్తారని మోసపోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  Last Updated: 07 Nov 2023, 05:21 PM IST