Site icon HashtagU Telugu

Shocking: ఇంటి కరెంట్ బిల్లు 7 లక్షల 97 వేలు, యజమాని గుండె గుభేల్లు

ఎండాకాలం మొదలైదంటే చాలు ఏ ఇంటిలోనైనా కరెంటు బిల్లులు తడిసి మోపడవుతాయి. వందల్లో వచ్చే బిల్లు వేలల్లో ఉంటుంది. కానీ ఓ ఇంటికి ఏకంగా 7,97,576 రూపాయల కరెంట్ బిల్లు వేశారు అధికారులు. ఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా ఏడు లక్షల తొంబై ఏడువేల ఐదువందల డెభై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుభేల్లుమంది.

గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడువందల లోపు కరెంట్ బిల్లు వచ్చేది. మే నెలకి సంబందించిన కరెంట్ బిల్లు జూన్ నెలలో వచ్చిన బిల్లు ఆన్లైన్ లో చూడగానే వారికి గుండె ఆగినంత పనైంది. విషయం తెలుసుకున్న కాలనీవాసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

Also Read: Hyderabad Libraries: లైబ్రరీకి వెళ్దాం.. జాబ్ కొట్టేదాం, ఆశల పల్లకీలో నిరుద్యోగులు!