Site icon HashtagU Telugu

Viral: ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయిన కాకి.. కాపాడిన ఎలుగుబంటి.. వీడియో వైరల్!

Article 2713341 202ecf8c00000578 159 636x382

Article 2713341 202ecf8c00000578 159 636x382

Viral: మనుషులకు కాదు.. జంతువులు కూడా జాలి, దయ, కరుణ ఉంటాయని కొన్ని వీడియోలను చూసినప్పుడు అర్ధమవుతుంది. ఆపదలో ఉన్నవారిని కాపాడుతూ జంతువులు సహాయం చేస్తూ ఉంటాయి. ప్రాణాలను కాపాడుతూ తమలో ఉన్న దయను బయటపెడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. నీటితో మునిగిపోతున్న ఓ కాకిని ఎలుగుబంటి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఆసక్తికర ఘటన హంగేరిలోని బుదాపేస్ట్ జూలో చోటుచేసుకుంది. ఓ కొలను ఒడ్డుకు వెళ్లిన ఒక కాకి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయింది. నీటితో పడిపోయిన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో ఇది గమనించిన ఓ ఎలుగువంటి కాకిని కాపాడింది. నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి పట్టుకుని బయటకు లాగేసింది. దీంతో కాకి ప్రాణాలతో బయటపడింది. ఎలుగుబంటి నోటి సాయంతో కాకి రెక్కలను పట్టుకుని ఒడ్డుకు లాగేసింది. ఆ తర్వాత ఎలుగుబంటి తన దారిని తాను పోయింది.

ఎలుగుబండి కాపాడిన తర్వాత కాకి అక్కడ నుంచి వేరే ప్రాంతానకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను నెటివ్ అమెరికా సోల్ అనే ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ప్రస్తతుం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.5 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చాలామంది షేర్ చేయడంతో పాటు లైక్ లు కొడుతున్నారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తోన్నారు.

వేటాడే జంతువుల సైతం ఆపదలో ఉన్నప్పుడు కాపాడతాయని కామెంట్ చేస్తోన్నారు .మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రేమ, సానుభూతి ఉందని అంటున్నారు. క్రూర జంతువులు కూడా ఒక్కొక్కసారి జాలి చూపిస్తామని మరికొంతమంది కామెంట్ చేస్తోన్నారు. జంతువులకు ఎదుటి జంతువు మీద ఉన్న ప్రేమ చాలామంది మనుషులకు కూడా లేదని మరుికొంతమంది అంటున్నారు.