Couple Revenge: ప్రతీకారం తీర్చుకున్న జంట.. వాళ్లు చేసిన పనితో కంపెనీకి తీవ్ర నష్టం

కొంతమంది తాము అనుకున్నది దక్కకపోతే క్షణికావేశంలో ఇతరులకు నష్టాన్ని కలిగించే పనులు చేస్తారు. వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా వారికి వ్యతిరేకంగా పనిచేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 10:21 PM IST

Couple Revenge: కొంతమంది తాము అనుకున్నది దక్కకపోతే క్షణికావేశంలో ఇతరులకు నష్టాన్ని కలిగించే పనులు చేస్తారు. వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా వారికి వ్యతిరేకంగా పనిచేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ జంట అదే పని చేసింది. వెకేషన్ కోసం విల్లా దొరకలేదని, చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వలేదనే కోపంతో ఓ జంట ప్రతీకారం తీర్చుకుంది. విల్లా యాజమానికి, ఎయిర్ బీఎన్‌బీ సంస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించే పని చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

చైనాకు చెందిన భార్యాభర్తలు సౌత్ కోరియాలోని సియోల్ లో 25 రోజుల పాటు టూర్‌కు వెళ్లాలని భావించారు. ఇందుకోసం వెకేషన్ రెంటర్ కంపెనీ ఎయిర్ బీఎన్‌బీలో ఆన్‌లైన్ ద్వారా విల్లా బుక్ చేసుకున్నారు. అయితే బుక్ చేసుకున్న తర్వాత ఆ విల్లా తాము వెళ్లాల్సిన లొకేషన్ లో లేదని గుర్తించారు. ఎక్కడో శివారులో విల్లా ఉందని తెలుసుకుని క్యాన్సిల్ చేసుకోవాలని భావించారు. అయితే విల్లా యాజమాని ఒప్పుకోకపోవడంతో చెల్లించిన డబ్బులు వెనక్కి రాలేదు. దీంతో విల్లా యాజమానికి ఈ జంట ఖంగుతినేలా షాకిచ్చింది.

విల్లాలో అవసరానికి మించి లైట్లు, ట్యాప్ లు, ఎలక్ట్రికల్ వస్తులు, గ్యాస్ ట్యాప్ లను ఆన్ చేశారు. 25 రోజుల పాటు విల్లాలోనే గడిపారు. కేవలం ఐదుసార్లు, ఐదు నిమిషాలు మాత్రమే సియోల్ ను సందర్శించారు. ఇక 25 రోజులు ముగిసిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్యాస్ కంపెనీల వారి నుంచి యజమానికి ఫోన్ వచ్చింది. మీ విల్లాలో గ్యాస్ వినియోగం ఎక్కువగా జరిగిందని చెప్పారు. విల్లాలో ఏదైనా ప్రమాదం జరిగిందా అనే ఆరా తీశారు.

ఈ క్రమంలో విల్లా యజమాని లీ తన విల్లకు వెళ్లి చూశాడు. అక్కడ గ్యాస్ అలాగే ఆన్ చేసి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. ప్రతీకారంతో దంపతులు చేసిన పనిని చూసి యజమాని షాక్ అయ్యాడు.