Site icon HashtagU Telugu

Nirmala Sitharaman: పాకిస్తాన్‎లో కంటే ఇండియాలోనే ముస్లింల పరిస్థితి మెరుగ్గా ఉంది

Developed Country

Nirmala Sitharaman

భారత్‌ పట్ల పాశ్చాత్య దేశాల ప్రతికూల అవగాహనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని, ఈ జనాభా సంఖ్య మాత్రమే పెరుగుతోందని సీతారామన్ అన్నారు. పాకిస్తాన్ లో కంటే భారత్ లోనే ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పారు.అంతర్జాతీవ్ర ద్రవ్యనిధి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొనేందుకు నిర్మాలా సీతారామన్ వాషింగ్టన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన పీటర్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన ప్రసంగించారు. భారత్ పాశ్చాత్య దేశాలపై ఉన్న అభిప్రాయాలపై సమాధానాలు ఇచ్చారు.

భారతదేశంలో ముస్లిం మైనార్టీల హింసపై మీడియాలో వస్తున్న కథనాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో ముస్లింలు ఉన్న రెండో అతిపెద్ద దేశం భారత్. వీరి సంఖ్య ఇంకా పెరుగోతంది. భారత్ లో ముస్లింల జీవితం కష్టతరంగా మారిందని ఎవరైనా భావించినట్లయితే..1947 కంటే ముస్లిం జనాభా పెరుగుతోందన్నది నిజం అయితే, అదే సమయంలో ఏర్పడిన పాకిస్తాన్‌కి విరుద్ధమా? అంటూ ప్రశ్నించారు.

ఆ దేశంలో ప్రతి మైనారిటీ సంఖ్య తగ్గుతోంది. అక్కడ నుంచి కొన్ని ముస్లిం వర్గాలు కూడా తొలగించబడ్డాయి. అయితే, భారతదేశంలో, ప్రతి రకమైన ముస్లిం తన జీవితాన్ని చక్కగా జీవిస్తున్నట్లు మీరు చూస్తారు. తన వ్యాపారం చేస్తూ తన పిల్లలకు చదువులు, ఫెలోషిప్ కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు.