Site icon HashtagU Telugu

Porn Site Ban: కేంద్రం కీలక నిర్ణయం…67పోర్న్ సైట్లపై నిషేధం…వాటి లిస్ట్ ఇదే..!!

Porn

Porn

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 67 పోర్న్ వెబ్ సైట్లను బ్యాన్ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ రూల్స్ అతిక్రమించినందుకు ఈ సైట్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. డాట్ ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు ఈ ఆదేశాలు జారీ చేసింది. పుణే కోర్టు ఆదేశాల మేరకు డాట్ సర్వీస్ ప్రొవైడర్లకు పోర్న్ వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని మెయిల్ పంపింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు మరో నాలుగు వెబ్ సైట్లను బ్యాన్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా మరో నాలుగు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని కోరింది.

కంపెనీలకు పంపిన ఇమెయిల్‌లో, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సెప్టెంబర్ 24న జారీ చేసిన ఉత్తర్వులో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అసభ్యకరమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వీటిని నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ జాబితాలోని వెబ్‌సైట్‌లు / URLలు పని చేయవు. మంత్రిత్వ శాఖ 2021లో అమలు చేసిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తిని పూర్తిగా లేదా పాక్షికంగా నగ్నంగా చూపించే కంటెంట్‌ను కంపెనీలు అడ్డుకోవడం తప్పనిసరి.