Free App: ప్రీ యాప్ లపై కేంద్రం సీరియస్… కొత్తచట్టం తెచ్చేలా ప్రణాళికలు !

స్మార్ట్ ఫోన్ల ద్వారా గూఢచర్యం, వ్యక్తిగత సమాచార దొంగలించటమనే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 09:11 PM IST

Free App: స్మార్ట్ ఫోన్ల ద్వారా గూఢచర్యం, వ్యక్తిగత సమాచార దొంగలించటమనే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. స్మార్ట్ పోన్లలో ముందే ఇన్స్టాల్ చేసి ఉంచుతున్న యాప్ లను తొలగించేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఓ చట్టం తెచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.

ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్ ల ద్వారా లబ్ధిపొందుతున్న శాంసంగ్, రెడ్మీ, వివో, యాపిల్, షావోమీ వంటి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల వ్యాపారం దెబ్బతిననుంది. ముందుగానే ఇన్స్టాల్ చేసి ఉంచుతున్న యాప్లే భద్రతాపరంగా ముప్పు తెచ్చి పెడుతున్నట్లు గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. దీన్ని చైనా వంటి విదేశాలు దుర్వినియోగపర్చి దేశ భద్రతకు భంగం కలిగించకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

2020లో గల్వా న్ ఘర్షణ తర్వాత చైనా వ్యా పారాలపై భారత్ నిఘా పెంచింది. ఇప్పటికే టిక్టాక్ సహా 300కు పైగా చైనా యాప్లను నిషేధించింది. అలాగే చైనా సంస్థలు భారత్ లో చేస్తున్న పెట్టుబడులపైనా తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగానూ వివిధ దేశాలు చైనా రూపొందించిన సాంకేతికతపై ఆంక్లు విధిస్తున్నాయి. హువావే, హిక్విజన్ వంటి సంస్థల పరికరాలపై నిషేధం విధించాయి. ఎక్కడ వాటిని చైనా గూఢచర్యానికి వాడుకుంటుందోననే అనుమానంతోనే ఆ దిశగా చర్యల చేపట్టినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.