Site icon HashtagU Telugu

Constitutional Court: రాజ్యాంగ ధర్మాసనానికి స్వలింగ సంపర్కుల కేసు!

406951 Supreme Court Of India Sc

406951 Supreme Court Of India Sc

Constitutional Court: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టులో కేం ద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు అఫిడవిట్ కూడా వేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్లపై తుది వాదనలను వినేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు. ఏప్రిల్‌ 18వ తేదీన ఐదుగురు
న్యాయమూర్తులతో కూడిన ధర్మాసం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.

సాధారణంగా చాలా క్లిష్టతమైన కేసులను మాత్రమే రాజ్యంగ ధర్మాసనానికి సిఫారస్సు చేస్తారు. ఈ కేసు కూడా అలాంటిది కాబట్టే సుప్రీంకోర్టలు ఈ నిర్ణయం తీసుకుంది. సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ కేసు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని తెలిపింది.

ఈ కేసుకి సం బంధించిన వాదనలు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో లేదా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ధర్మాసనం తెలిపింది. ఇది సమాజంపై ప్రభావం చూపే కీలక అంశం కాబట్టి దీన్ని పరిగణలోని తీసుకోని సరైన తీర్పు ఇవ్వాలని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

రాజ్యంగంలోని ఆర్టికల్‌ 145(3) ప్రకారం ఐగుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఈ సమస్యను పరిష్కరించడమే సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇటీవల నలుగురు స్వలింగ సంపర్కులు తమ వివాహాలను గుర్తించడమే గాక తమకు నచ్చి వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఈ మేరకు ప్రభత్వం తరుఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్వలింగ సంపర్కుల వివాహలను గుర్తిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని అన్నారు.