Site icon HashtagU Telugu

Satyavati Rathod: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు.. కారణమిదే

Satyavathi-Rathod

Satyavathi-Rathod

మంత్రి సత్యవతి రాథోడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హారతి పళ్లెంలో డబ్బులు పెట్టినందుకు గాను పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. అదేంటి.. హారతి పళ్లెంలో డబ్బులు పెడితే కేసు పెట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా ? హారతి పళ్లెంలో డబ్బులు పెడితే కేసు పెట్టరు. కాకపోతే.. ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పెట్టినందుకు కేసు నమోదు చేశారు. ఆమె వ్యవహరం ఓటర్లను మభ్యపెట్టేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ జరిపి మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్ పార్టీ(Congress)కి ఓటేస్తే పోయిందనుకున్న దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకున్నట్టే. కాంగ్రెస్‌ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం అని పార్టీ నేతలు కోతలు కోస్తున్నారని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ (Minister Sathyawathi) అన్నారు. శుక్రవారం జిల్లాలోని రెడ్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోరుతూ మంత్రి ప్రచారం నిర్వహించారు.