Hyderabad: దాగుడుమూతలు ఆడుతూ టెర్రస్ పై నుంచి పడి బాలుడి మృతి

టెర్రస్‌పై స్నేహితులతో ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.

Published By: HashtagU Telugu Desk
Crime

Crime

Hyderabad: హైదరాబాద్ లోని సూరారం లో ఓ వద్ద భవనం టెర్రస్‌పై స్నేహితులతో ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం నుంచి నగరానికి వలస వచ్చిన బాలుడు భవనంలో తల్లి, అమ్మమ్మలతో కలిసి నివాసం ఉంటుననాడు. అబ్బాయి పేరు సనాల తులసీనాథ చారి.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి స్నేహితుల్లో ఒకరు వారు దాగుడు మూతలు ఆడుతున్నారని, ఆ సమయంలో ఇతరులను వెతకాల్సి రావడంతో కళ్లకు గంతలు కట్టుకున్నాడు.

మిగతా వారి కోసం వెతుకుతుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. పడిపోవడాన్ని గమనించిన స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడి చనిపోయాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు ప్రాథమికంగా తేలినప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని సూరారం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఎం. వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

Also Read: Kakatiya University: చట్టబద్ధంగానే విద్యార్థుల అరెస్టులు : కమిషనర్ రంగనాథ్

  Last Updated: 08 Sep 2023, 11:53 AM IST