Expressway: ప్రారంభమైన అతిపెద్ద ఎక్స్ ప్రెస్ వే.. ఎంత ఖర్చు అయ్యిందంటే?

ఎప్పటికప్పుడు మన దేశం ముందు ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ పలు రంగాలలో మన దేశం ముందడుగులో ఉంది.

Published By: HashtagU Telugu Desk
Javjf8kg Delhi Mumbai Expressway 625x300 11 February 23

Javjf8kg Delhi Mumbai Expressway 625x300 11 February 23

Expressway: ఎప్పటికప్పుడు మన దేశం ముందు ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ పలు రంగాలలో మన దేశం ముందడుగులో ఉంది. రవాణా పరంగా, వాణిజ్యపరంగా, ఇతర రంగాల పరంగా దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. రవాణా పరంగా ఇప్పటికే హైవే లాంటి రహదారులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే విధంగా చేశారు.

అయితే తాజాగా ఏకంగా ఎక్స్ప్రెస్ వే నే ప్రారంభమైంది. ఢిల్లీ నుండి ముంబై కు ఎక్స్ప్రెస్ వే ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ వే లో ఢిల్లీ – దౌసా – లాల్ సోట్ మధ్య పూర్తయిన తొలిదశ హైవే ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంను రాజస్థాన్లోని దౌసాలో నిర్వహించారు. ఇక దీనితోపాటు రూ.18,100 కోట్లతో నిర్మించనున్న మరో నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా చేశారు.

ఇక ఈ కార్యక్రమంకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు. ఇక నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి ముంబై ఎక్స్ప్రెస్ వే అభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవఉందని తెలిపాడు. ఇక 247 కిలోమీటర్ల మేర ఈ రహదారిను 8 లేన్లుగా రూ.10,400 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇక ఇకపై ఈ రహదారి వెంబడి ఢిల్లీ నుంచి జైపూర్ కు మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఐదు గంటల సమయం పడుతుంది.

ఇక ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2019 మార్చి 9న శంకుస్థాపన చేసింది. ఢిల్లీ తో పాటు ఐదు రాష్ట్రాలను కలుపుతూ 1386 కిలోమీటర్ల మేర మార్గం వెళుతుంది. ఇక మధ్యలో కొన్ని పట్టణాలను కూడా కలుపుతుంది. ఇక ఈ మార్గం పూర్తిగా సిద్ధమైన తర్వాత ఢిల్లీ, ముంబై ల మధ్య ఉన్న దూరం 180 కి.మీ వరకు తగ్గుతుంది. ఇక ఈ మార్గం నిర్మాణం కోసం ఐదు రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని తీసుకున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

  Last Updated: 12 Feb 2023, 07:55 PM IST