Site icon HashtagU Telugu

Tipu Sultan: వామ్మో.. టిప్పు సుల్తాన్ ఖడ్గం అన్నీ రూ. కోట్లా?

Tipu Sultan

Tipu Sultan

మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఇతని పేరు ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు. టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గానికి వేలంలో విశేష ఆదరణ లభించింది. 18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గాన్ని లండన్ లోనే బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ వేలం వేసింది. ఈ ఖడ్గం ఏకంగా 1,40,80,900 పౌండ్లకు అమ్ముడు అయింది. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.144 కోట్లకు పై మాటే అని చెప్పవచ్చు. తాజాగా మే 23వ తేదీన ఈ ఖడ్గాన్ని బోన్హమ్స్ సంస్థ వేలం వేసింది.

ఈ ఖడ్గం కోసం ముగ్గురు బిడ్డర్లు చివరి వరకు పోటీ పడగా చివరకు 14 మిలియన్ల పండ్లకు ఒక బిడ్డర్ ఆ ఖడ్గాన్ని దక్కించుకున్నారు. అయితే ఖడ్గాన్ని ఎవరు కొనుగోలు చేశారు అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ ఆ ఖడ్గం మాత్రం ఊహించిన దాని కంటే అంచనా వేసిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువ అమ్ముడైనట్లు ఆక్షన్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఆయుధాల్లో దీనిని అత్యంత శక్తివంతమైన ఖడ్గంగా భావిస్తారు. ఈ ఖడ్గాని 2003లో విజయ్ మాల్యా లండన్ లోని ఒక ఆక్షన్ హౌస్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో దానిని ఆయన ప్రదర్శనకు కూడా ఉంచారట.

తర్వాత 2016లో ఈ ఖడ్గం గురించి ఒక ప్రకటన కూడా చేశారట. అలా చేయడం వల్ల వారి కుటుంబానికి బ్యాడ్ లక్ రావడంతో దాన్ని వదిలించుకున్నట్లు అప్పట్లోనే మాల్యా చెప్పినట్లు వార్తలు జోరుగా వినిపించాయి. మొత్తానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం అన్ని కోట్లకు వేలం పాడడంతో చాలామంది ఆ వార్త విని షాక్ అవుతున్నారు. వామ్మో అన్ని కోట్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version