CM Jagan: సాగునీటి ఎద్దడిని అధిగమించి మానవాళికి ఆహార భద్రత చేకూర్చడమే అజెండాగా నిర్వహిస్తోన్న మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ పట్టణం వేదికైంది. 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్-ICID కాంగ్రెస్ ప్లీనరీ విశాఖలో ప్రారంభమైంది. నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి విస్తారమైన తీర ప్రాంతం ఉందని… ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి జగన్. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోందని.. వర్షపు నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వినియోగించుకోవాలన్నారు. విశాఖలో జరుగుతున్న 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్-ICID కాంగ్రెస్ ప్లీనరీ లో కేంద్ర జలశక్తి మంత్రి మాట్లాడుతూ…. జలవనరులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.