Site icon HashtagU Telugu

Aravind Kejriwal: అందుకే చదువుకోండి ఫస్ట్ పీఎం గారు

Aravind Kejriwal

Aravind Kejriwal

Aravind Kejriwal: అందుకే చదువుకోండి ఫస్ట్… ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఓ కార్యక్రమంలో ఓ విద్యార్థి అన్న మాటలివి. పెళ్లి గురించి మీకెందుకు.. చదువుకోండి ఫస్ట్ అంటూ చెప్పిన ఆ విద్యార్థి డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదిలా ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అదే డైలాగ్ ని రిపీట్ చేశారు. అందుకే చదువుకొమ్మనేది అంటూ పీఎం మోడీని ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ అలా అనడానికి రీజన్ ఏంటి? ప్రధాని మోడీ చదువు విషయంలో కేజ్రీవాల్ ఆ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చూద్దాం.

2016 లో దేశంలో పెద్ద నోట్లని రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో పేరుకుపోయిన నల్లడబ్బుని బయటకు తీసేందుకు మోడీ సర్కార్ 2016లో 500, 1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే. పాత నోట్లను మార్చుకోవడంలో, కొత్త నోట్ల కోసం బ్యాంకులు, ఎటిఎంల వద్ద ప్రజలు బారులు తీరిన రోజులు ఎప్పటికీ మరవలేనిది. అయితే తాజాగా 2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అందుకే ప్రధాని చదువుకోవాలి అంటూ హాట్ కామెంట్స్ చేస్తారు. ట్విట్టర్ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలకు దిగారు.

కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందిస్తూ… నిరక్షరాస్యుడైన ప్రధాని మోడీకి ఎవరైనా చెప్పగలరా… చెప్తే వింటాడా.. అందుకే ప్రధాని చదువుకుని ఉండాలి అంటూ విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ఏమైనా అవినీతి తగ్గిందా?, గతంలో పెద్ద నోట్లని రద్దు చేసి 2000 నోటు అమల్లోకి తీసుకొచ్చారు, ఇప్పుడేమైనా అవినీతి తగ్గిందా అంటూ ప్రశ్నలు సంధించారు. కాగా గతంలో కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ పట్టాపై అనేక ఆరోపణలు చేశారు. ప్రధాని డిగ్రీ ఎక్కడ చదివాడో చెప్పాలని ఆయన పలుమార్లు ప్రశ్నించారు. గతంలో ఈ ఇష్యూ పెద్ద వివాదంగా మారింది. ఇక తాజాగా కేజ్రీవాల్ ప్రధాని విద్యార్హతపై మరోసారి హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

Read More: AP Trend : BJP కి షాక్‌,కామ్రేడ్ల‌తో TDP,JSP కూట‌మి?

Exit mobile version