Site icon HashtagU Telugu

Thatikonda Rajaiah : తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా..?

thatikonda rajaiah joins congress

thatikonda rajaiah joins congress

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు మరో షాక్ తగలబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైంది. కాగా ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ సంఖ్యలో ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్ (CM KCR) ..కొంతమందికి మాత్రం మొండిచెయ్యి చూపించారు. వారిలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) ఒకరు. మొదటి నుండి కూడా తాటికొండ రాజయ్య విషయంలో కేసీఆర్ నుండి అవమానాలే ఎదురవుతూ వస్తున్నాయి. ఉపమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకోవడం..ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోకపోవడం..ఇదే తరుణంలో తాటికొండ రాజయ్య ఫై పలు ఆరోపణలు రావడం ఇలా జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా ఆయనకు టికెట్ ఇవ్వకుండా..కడియం కు టికెట్ ఇచ్చి రాజయ్య నిరాశ మిగిల్చాడు.

టికెట్ రాకపోవడం తో ఎమోషనల్ అయినా రాజయ్య..మొన్నటి వరకు తాను బిఆర్ఎస్ లోనే ఉంటా..కేసీఆర్ కు సపోర్ట్ చేస్తూ ఉంటా అని చెపుతూ వచ్చాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దామోదర రాజనర్సింహ(Damodar Raja narasimha)తో తాటికొండ రాజయ్య రహస్యంగా భేటీ అయినట్టుగా ఫొటోస్ బయటకు వచ్చాయి. హన్మకొండ జిల్లా నయీంనగర్‌లోని ప్రెసిడెంట్‌ దాబాలో మాదిగ ఇంటలెక్చువల్స్‌ సదస్సు సోమవారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు దామోదర రాజనర్సింహతో పాటు తాటికొండ రాజయ్య సైతం హోటల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎదురుపడిన వారిద్దరూ మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం హౌటల్‌లో రహస్యంగా రాజనర్సింహతో రాజయ్య సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది.

Read Also : Uttam Kumar Reddy : ఉత్తమ్ కు దక్కిన ‘ఉత్తమ’ గౌరవం

తాటికొండ రాజయ్య పార్టీ మారతారన్న ప్రచారం..కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రాజయ్యతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వచ్చిన దాస్యం వినయ్ భాస్కర్..ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. రాజయ్యతో పలు విషయాలపై వినయ్ భాస్కర్ చర్చించారు. పార్టీ విషయాలు మాట్లాడేందుకే రాజయ్య దగ్గరకు వచ్చానని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. రాజయ్య టికెట్ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసమే తాను దామోదర రాజనర్సింహను కలిశానని రాజయ్య చెప్పుకొస్తున్నాడు. మరి నిజంగా ఇదేనా..? లేక పార్టీ మారేందుకు భేటీ అయ్యారా ..అనేది వారే క్లారిటీ గా చెప్పాలి. రీసెంట్ గా తుమ్మల – రేవంత్ సైతం భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్..తుమ్మలను ఆహ్వానించారు. మొత్తం మీద బిఆర్ఎస్ టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది.