Medaram: మేడారం జాతర నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: కొండా సురేఖ

Medaram: మేడారం జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, , పోలీసులు, దేవాదాయ శాఖ, శానిటేషన్ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన ప్రతి ఉద్యోగికి, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణలో అన్ని శాఖలు పరస్పర సహకారంతో, సమన్వయంతో వ్యవహరించి, […]

Published By: HashtagU Telugu Desk
Konda Surekha

Konda Surekha

Medaram: మేడారం జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, , పోలీసులు, దేవాదాయ శాఖ, శానిటేషన్ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన ప్రతి ఉద్యోగికి, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

జాతర ఏర్పాట్లు, నిర్వహణలో అన్ని శాఖలు పరస్పర సహకారంతో, సమన్వయంతో వ్యవహరించి, చిత్తశుద్ధిని కనబరచి ఈ మహా జాతరను దిగ్విజయవంతంగా పూర్తి చేసాయని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జాతర పనులను ముందు నుండే ప్రణాళికాబద్ధంగా చేపట్టడంతో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకొని, మొక్కులు చెల్లించుకొని, సంతృప్తితో తిరుగు ప్రయాణమయ్యారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం భక్తులకు అడుగడుగునా అన్ని వసతులను కల్పించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

  Last Updated: 25 Feb 2024, 06:40 PM IST