Thana Diwas: “ఠాణా దివస్”కు ప్రజల క్యూ.. వినతుల వెల్లువ

“ఠాణా దివస్” (Thana Diwas)కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Thana Diwas

Thana Diwas

“ఠాణా దివస్” (Thana Diwas)కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రతి నెల స్వయంగా ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రజల ముఞ్చసి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఎస్పీ వస్తున్నారని తెలిసి ..ఫిర్యాదు లేఖలు పట్టుకొని ప్రజలు ప్రతినెలా వందలాదిగా పోలీసు స్టేషన్ల ఎదుట క్యూ
కడుతున్నారు.

తాజాగా గురువారం ఉదయం నుంచి ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో 113 అర్జీలను ఎస్పీ అఖిల్ మహాజన్ స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. భూమూల ఇష్యూలలో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వెల్లడించారు.

Also Read: Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? మౌనిక మ‌ర‌ణ పాపం ఎవ‌రిది?

  Last Updated: 04 May 2023, 11:51 PM IST