Site icon HashtagU Telugu

Thalapathy Vijay: లియో షూటింగ్ కంప్లీట్

Leo

Leo

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న ‘లియో’ మూవీ అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో ఆసక్తిని రేపుతోంది. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ‘లియో’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి దిగిన స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్. 7 స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడు. ప్రియా ఆనంద్, సీనియర్ నటుడు అర్జున్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పాటలపై క్లారిటీ ఇచ్చిన తమన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. అక్టోబర్ 19న దసరా కానుకగా లియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి విజయ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలారోజుల తర్వాత విజయ్ పక్కన అందాల నటి త్రిష నటిస్తుండటంతో లియోపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

Exit mobile version